మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

  Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం
 

Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం Sanatana Dharm సనాతన ధర్మం

 telugu పండుగలు  తెలుగు - కథలు దేవిదేవతలు అద్భుతమైన తెలుగు సూక్తులు |telugu motivation|telugu ... 

హిందూ నాగరికత చారిత్రక కాలక్రమం: క్రీ.పూ. 2000లకు ముందు..... సింధు లోయ నాగరికత - క్రీ.పూ. 1500-500 .... వేదయుగం - క్రీ.పూ. 500-క్రీ.శ.500 .... ఇతిహాస, పురాణ,  చారిత్రక యుగం - క్రీ.శ. 500-1500 .... మధ్యయుగం - క్రీ.శ. 1500-1757 ..... పూర్వ ఆధునిక యుగం క్రీ.శ. 1757-1947 బ్రిటిష్‌‌ యుగం .... సనాతన ధర్మం యొక్క ముఖ్యమైన గ్రంథాలు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, ఆగమాలు మరియు స్తోత్రాలు. ఈ గ్రంథాలలో సనాతన ధర్మం యొక్క మూలాలు, సూత్రాలు, నైతిక నియమాలు మరియు ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నాయి. వీటిలో వేదాలు అత్యంత ప్రాచీనమైనవి మరియు ముఖ్యమైనవి, వీటిలో నాలుగు వేదాలు ఉన్నాయి: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అధర్వణ వేదం.

   

దైవాన్ని నమ్మిన వాడికి అదృష్టం తలుపు తడుతుంది.


దైవాన్ని నమ్మిన వాడికి అదృష్టం తలుపు తడుతుంది. అదృష్టవంతులు మాత్రమే దైవాన్ని ఆశ్రయిస్తారు.

అదృష్ట వంతున్ని ఎవరు చెడ గొట్ట లేరు. మనవులను పొగుడుతూ దైవాన్ని తక్కువగా చూచే దురదృష్ట వంతున్ని బాగూ చేయ లేరు. ఉదాహరణగా ఈ కథ..

ఒక రాజు గారి కొలువు లో ఇద్దరు పురోహితులున్నారు . అందులో ఒకనిపేరు దైవాధీనం. ‘’దైవా దీనం జగత్ సర్వం ‘’అని నమ్మిన వాడు . జగత్తు అంతా దేవుని అధీనమై ఆయన సంకల్పం చేత నడుస్తున్నది అని నమ్మేవాడు కనక ఆపేరు వచ్చింది ఆయనకు.

 

రెండో వానిపేరు రాజాధీనం. రాజు గారి పరిపాలన బాగా ఉందని అందుకే ప్రజలంతా సుఖం గా ఉన్నారని నమ్మే వాడు కనుక ఇతనికి రాజాధీనం అనే పేరు వచ్చింది. .రాజు గారి మెప్పు పొంది ఇతను అప్పుడప్పుడు రాజ బహుమానం అందు కునే వాడు .

ఒక రోజు రాజు గారికి రాజాదీనం గారిని సువర్ణ ,వజ్ర వైదూర్యాలతో సత్క రించాలని కోరిక కలిగింది .అదీ ఎవరికీ తెలీకుండా రహస్యం గా చేయాలని భావించాడు .ఒక గుమ్మడి కాయ ను తెప్పించి దానికి కన్నం పెట్టించి అందులో వజ్ర వైదూర్య రత్న మాణిక్య సువర్నాలను నిక్షేపం చేసి రాజాదీనం గారికి స దక్షిణం గా దానం చేశాడు .ఆయన దాన్ని ఇంటికి మోసుకు పోతూ ఆలోచించాడు. " దాన్ని అమ్మేసి డబ్బులు తీసుకుంటే మంచిది" అని. ఆలోచన వచ్చిన వెంటనే ఒక శెట్టి గారికి అమ్మి ఆయన ఇచ్చిన పావలా డబ్బులు తీసు కొని ఇంటికి వెళ్లాడు .

 

శెట్టిగారికి ఒక ఆలోచన వచ్చింది . "గుమ్మడి కాయ దొరికింది పితృదేవతల పేరు తో దాన్ని దానం చేస్తే పుణ్యం అని పెద్దలు అంటారు. ఎవరైనా భగవద్భక్తిపరాయణులైన వారికి దానం చేస్తాను." అను కొన్నాడు .అప్పుడే అనుకోకుండా దైవాధీనం గారు అటు వెళ్తూ కని పించారు . సెట్టిగారు ఆయనను ఇంటికి ఆహ్వానించి దక్షిణ తో సహా కూష్మాండ దానం (గుమ్మడికాయ దానం) చేశారు . దైవాధీనం గారి భార్య .... భర్త తెచ్చిన గుమ్మడి కాయను పగుల గొట్టించింది భర్త చేత .ఆడ వాళ్ళు గుమ్మడి కాయ పగుల గొట్ట రాదనీ ఆచారం కదా అందుచేత .అందులో వజ్రవైదూర్య మరకత మాణిక్య సువర్నాలు కని పించాయి .ఇదంతా దైవ లీల గా ఆయన భావించి పరమేశ్వరునికి కృతజ్ఞత తెలిపాడు

మర్నాడు రాజాదీనం రాజ దర్శనానికి వెళ్లాడు ."గుమ్మడి కాయ కూర తిన్నారా..." అని రాజు అడిగాడు . ఆహా ,ఓహో అద్భుతం అని బొంకారు రాజాధీనంగారు. .రాజు గారికి అర్ధమైంది .... గుమ్మడి కాయ ఆయన ఇంటికిచేర లేదని . ఒల్లుమండింది. భటులను పిలిపించి కొరడా తో ఝాలిపించి నిజం కక్కించాడు .

 

శెట్టి ని పిలిచి అడిగితె డబ్బు ఇచ్చి దాన్ని దాన్నికొన్నాననీ... దైవాధీనం గారికి దానం చేశాననీ.. చెప్పాడు .తాను ఒకటి తలిస్తే దైవం ఇంకో లాగా చేశాడేమిటి అని వితర్కించు కొన్నాడు రాజు .

మరోసారి ఒక సంచి లో ధనాన్ని మూట కట్టించి రాజాధీనం గారు వచ్చే దారిలో పెట్టి ... భటుడి ని కని పించ కుండా ఏం జరుగుతుందో చూస్తూ ఉండమన్నాడు. రాజదీనం నడచి వస్తు ,దాన్ని గమనించ కుండా వెళ్లి పోయాడు .భటుడు రాజుగారికి విషయం తెలిపాడు .ఆయన మళ్ళీ ఆశ్చరయం లో మునిగాడు . రాజాదీనాన్ని పిలిపించి ఆ మూటను ఎందుకు చూడ లేదని అడిగాడు దానికి అతడు రోజు వెళ్ళే దారే కదా కళ్ళు మూసు కొని వెళ్ళ లేనా అని అక్కడికి రాగానే అని పించిందని అందుకని కళ్ళు మూసుకొని వెళ్ళా.అని బదులు చెప్పాడు.

రాజుకి అర్థమైంది... తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తుంది అని.

 

"దైవాన్ని నమ్మిన వాడికి అదృష్టం తలుపు తడుతుంది "అని ఇందులో ఉన్న సారాంశం.

     

 
       
     

"Bharath First - I Love My Bharath"

   
 

www.sanatanadharm.com - play store app (sanatana dharm)  

 
 

"Bharathiya Sanatana Dharmam" and Sanatana Dharm & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. 2019-2025 Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.